• Home  
  • Nagarjuna: రొమాన్స్ చేసిన నాగార్జునకు విలన్ గా టబు, 28 ఏళ్ల తరువాత అభిమానులకు షాక్..
- Entertainment - Uncategorized

Nagarjuna: రొమాన్స్ చేసిన నాగార్జునకు విలన్ గా టబు, 28 ఏళ్ల తరువాత అభిమానులకు షాక్..

టాలీవుడ్‏లో కింగ్ నాగార్జున, టుబ జంట అంటే రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఇద్దరు శత్రువులుగా మారబోతున్నారు. నాగార్జున విలన్ గా టబును సెట్ చేశాడు దర్శకుడు. టాలీవుడ్ లో రొమాంటిక్ జంటగా కింగ్ నాగార్జున,టబుకి పేరుంది. ఈఇద్దరు కలిసి చేసిన మూడు సినిమాల్లో ఘాటు రొమాన్స్ తో అలరించారు. ఒక టైమ్ లో ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో అన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో కలిగాయి. కానీ ఆతరువాత టబు […]

nagarjuna tabu

టాలీవుడ్‏లో కింగ్ నాగార్జున, టుబ జంట అంటే రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఇద్దరు శత్రువులుగా మారబోతున్నారు. నాగార్జున విలన్ గా టబును సెట్ చేశాడు దర్శకుడు.

టాలీవుడ్ లో రొమాంటిక్ జంటగా కింగ్ నాగార్జున,టబుకి పేరుంది. ఈఇద్దరు కలిసి చేసిన మూడు సినిమాల్లో ఘాటు రొమాన్స్ తో అలరించారు. ఒక టైమ్ లో ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో అన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో కలిగాయి. కానీ ఆతరువాత టబు బాలీవుడ్ సినిమాల్లో బిజీ అయిపోవడం, తెలుగు సినిమాలు తగ్గించడంతో.. ఆ వార్తలకు తెరపడింది. ఈవిషయంలో కింగ్ నాగార్జున కూడా పలుమార్లు స్పందించారు. టబు తనకు మంచి స్నేహితురాలే కానీ.. అంతకు మించి ఏమీ లేదన్నారు. ముంబయ్ లో ఉండే ఆమె.. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తన ఇంట్లోనే ఉంటుందని, అక్కినేని ప్యామిలీతో టబుకి మంచి అనుబంధం ఉందంని ఆయన అన్నారు.

ఈక్రమంలో కింగ్ నాగార్జునతో దాదాపు 28 ఏళ్ల తరువాత టబు కలిసి నటించబోతోంది. కింగ్ నాగార్జున 100వ సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే.. లేటు వయసులో ఘాటు రొమాన్స్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు. 66 ఏళ్ల నాగార్జున, 54 ఏళ్ల టబు భార్య భర్తలుగా కనిపిస్తారేమో అని మరికొందరు అన్నారు. కానీ ఈ ఇద్దరు అందుకు భిన్నంగా.. శత్రువులుగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. నాగార్జున హీరో పాత్ర వేస్తుండగా.. టబు నెగెటీవ్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం.

ఆన్ స్క్రీన్ పై ఘాటు రొమాన్స్ చేసిన ఈ జంట.. అదే స్క్రీన్ పై బద్ద శత్రువుల్ల కనిపించబోతున్నారు. టబుకు నెగెటివ్ రోల్స్ చేయడం కొత్తేమీ కాదు. ఈమధ్య కాలంలో ఆమె ఎఇటువంటి పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘హైదర్’, ‘మక్బూల్’, ‘ఫితూర్’ వంటి సినిమాల్లో చాలా కఠినమైన పాత్రలు పోషించిన ఆమె, ‘అంధాధున్’ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌తో యావత్ దేశాన్ని మెప్పించింది. విలన్ గా ఆమె నటనతో అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఇప్పుడు కింగ్ నాగార్జునకు ధీటైన విలన్‌గా ఆమె టాలీవుడ్‌లోకి స్ట్రాంగ్ రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital