సినిమా పరిశ్రమలో గ్లామర్‌కు, బోల్డ్ సీన్స్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ముద్దు సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలు సర్వసాధారణం అయిపోయిన నేపధ్యంలో, ఆమె అనుసరిస్తున్న ‘నో కిస్సింగ్ పాలసీ’పై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సినిమాల్లో ముద్దు సీన్లు, ఇంటిమేట్ సీన్ల కోసం చాలా మంది దర్శకులు తనను సంప్రదించారని సాయి పల్లవి వెల్లడించారు. తాను అలాంటి పాత్రలు చేయనని తెలిసినప్పటికీ ఇప్పటికీ అలాంటి ఆఫర్లు వస్తుంటాయని చెప్పారు. అయితే, నటన కోసమైనా సరే తెరపై మరొకరిని ముద్దు పెట్టుకోవడం తన మనస్సాక్షికి నచ్చదని ఆమె స్పష్టం చేశారు. “నాకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉంటే, నేను స్క్రీన్ పైన వేరొకరిని ఎలా ముద్దు పెట్టుకుంటాను?” అంటూ ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
డబ్బు లేదా లగ్జరీ లైఫ్ కోసం తన వ్యక్తిగత విలువలను ఎప్పుడూ వదులుకోనని సాయి పల్లవి ధీమాగా చెప్పారు. ఒక మనిషి సంతోషంగా జీవించడానికి ఒక మంచి కుటుంబం, ఉండటానికి ఒక ఇల్లు, ప్రయాణించడానికి ఒక కారు ఉంటే సరిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. భగవంతుడి దయ వల్ల ప్రస్తుతం తన దగ్గర అవన్నీ ఉన్నాయని, కేవలం ఇంకో కొత్త లగ్జరీ కారు కొనడం కోసమో లేదా ఎక్కువ డబ్బు సంపాదించడం కోసమో తాను వెండితెరపై హద్దులు దాటాల్సిన అవసరం లేదని వివరించారు.
దర్శకనిర్మాతలకు గుర్తుండిపోయే క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. .. “మీకు నా నుండి కేవలం స్వచ్ఛమైన నటన మాత్రమే కావాలనుకుంటే మీ సినిమాలో నన్ను తీసుకోండి. ఒకవేళ కథలో ముద్దు సీన్లు, అంతకంటే ఎక్కువ రొమాంటిక్ సీన్లు ఉంటే నా బదులు వేరే హీరోయిన్‌ను ఎంచుకోండి, దానికి నాకేమీ అభ్యంతరం లేదు” అని సాయి పల్లవి తేల్చి చెప్పారు.ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక ‘రామాయణ’ చిత్రంలో సీతగా నటిస్తుంది సాయి పల్లవి.