విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్ పూర్తయింది. పెళ్లి తర్వాత వీరు కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది. 2026 అక్టోబర్ 16న మూవీ రిలీజ్ కానుంది. 29 రోజుల కౌంట్‌డౌన్ కూడా మొదలైంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్ అధికారికంగా పూర్తయింది. రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ హిట్ పెయిర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ పూర్తయినట్లు మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతే కాదు 29 రోజుల కౌంట్‌డౌన్ కూడా మొదలుపెట్టింది.
సెట్లో ఎమోషనల్ అయిన రష్మిక
ఈ సినిమాలో రష్మిక మందన్న ‘జయమ్మ’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది. చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఆమె సెట్లో కాస్త ఎమోషనల్ అయ్యారు. షూటింగ్ పూర్తి కావడంతో ఈ క్షణాలు చిత్రయూనిట్ అంతటికీ చాలా స్పెషల్‌గా నిలిచాయి ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ “ఏందయ్య సామి” త్వరలోనే రిలీజ్ కానుందని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే రిలీజైన ‘రణబాలి’ టీజర్ చూశాక ఫ్యాన్స్‌లో అంచనాలు డబుల్ అయ్యాయి. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన చారిత్రక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ సీన్స్, పోరాటాలతో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్నారు.
పెళ్లి తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ
రియల్ లైఫ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కారు. భార్యాభర్తలుగా మారాక వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా ‘రణబాలి’. ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ల కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి.
