ఒత్తిడి జయంచడం ఎలా.. నాగార్జున పాటించే ఫిలాసఫీ ఏంటో తెలుసా?
తెలుగు చిత్రసీమలో ‘కింగ్’ నాగార్జున అంటే కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు.. ఎంతోమందికి ప్రేరణనిచ్చే ఒక పర్‌ఫెక్ట్ పర్సనాలిటీ. 66 ఏళ్ల వయస్సు దాటినా కూడా ఇంకా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వ్యాపారవేత్తగా, బిగ్‌బాస్ హోస్ట్‌గా బహుముఖ పాత్రలు పోషిస్తూ ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు, ప్రశాంతత కనిపిస్తాయి. అసలు నాగార్జున జీవితంలో వచ్చే సమస్యలను, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ప్రతీ సమస్యకి పరిష్కారం..
“సమస్య ఉంటే.. ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది”నాగార్జున చెప్పే మొదటి సూత్రం ఇదే.. కింగ్ చెప్పిన ఈ సలహా ఎంతో సరళమైనది, కానీ ఎంతో శక్తివంతమైనది. “ఒక సమస్య ఉందంటే.. దానికి తప్పకుండా ఒక పరిష్కారం కూడా ఉండే తీరుతుంది” అని నాగార్జున బలంగా నమ్ముతారు. జీవితంలో గానీ, బిజినెస్ లేదా సినిమాల్లో సమస్యలు రావడం సహజం. అయితే “ఇవాళ కాకపోతే రేపు, లేదా ఎల్లుండికైనా దానికి మార్గం దొరుకుతుంది”అనే పాజిటివ్ ఆలోచనే ఆయనను నిరంతరం ప్రశాంతంగా ఉంచుతుంది.
బాధపడటంలో అర్థం లేదు
ఎంత పెద్ద స్టార్ అయినా సరే బాధ లేదా ఒత్తిడి కలగడం సహజం. నాగార్జున కూడా తనకు ఒత్తిడి వస్తుందని, అనేక సందర్భాల్లో బాధపడతానని స్వయంగా అంగీకరించారు. కానీ ఆ బాధను మనసులోనే మోస్తూ మోహం చిన్నది చేసుకుని కూర్చోవడంలో అర్థం లేదని ఆయన అంటారు.”బాధపడుతూ కూర్చుంటే లేదా దాని గురించే ఆలోచిస్తూ ఉంటే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. అందుకే దాన్ని మోయకుండా ముందుకు సాగడమే నా లైఫ్ ఫిలాసఫీ”అని నాగార్జున స్పష్టం చేశారు.
ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన జీవిత పాఠం
సినిమా రంగంలో పరాజయాలు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు వచ్చినా నాగార్జున నిలకడగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. సమస్య గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవడం కంటే, ‘పరిష్కారం పై దృష్టి పెట్టడం తో పాటు.. గతాన్ని మోయకుండా ముందుకు సాగడం ద్వారానే ఆయన జీవితంలో ఇంతటి మానసిక ప్రశాంతతను, విజయాన్ని సాధించగలిగారు. ఒత్తిడితో సతమతమయ్యే ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన జీవిత పాఠం ఇది
