స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun) రాజకీయాల్లోకి వస్తారని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇటీవల అయన ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో(Prashant Kishor) భేటీ అయినట్టు సమాచారం.అయితే నిన్న అభిమానుల సమావేశంలో బన్నీ(Banni) పాల్గొన్నారు.ఈ సమావేశంలో అయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట.
అల్లు అర్జున్ అసోసియేషన్ పేరుతో ప్రజలకు కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అభిమానులకు బన్నీ పిలుపునిచ్చారు.దానికి కోసం ప్రత్యేకంగా ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఆర్థికంగా వెనకబడి చదువుకునే వారికీ సాయంచేయాలని,అలాగే అనారోగ్యంతో ఇబ్బందిపడే పేదవాళ్లకు ఆర్థిక సాయం వంటి అంశాలయంపై బన్నీ దిశానిర్దేశం చేసారు.
ఇదే సమయంలో రాజకీయాలపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట.ముందు ప్రజలకు చేతనైనంత సాయం చేద్దాం అవసరమైనప్పుడు ప్రజల్లోకి నేనే వస్తా అంటూ బన్నీ హింట్ ఇచ్చారట.దీనిపై ఇప్పడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.చూడాలి మరి తెలుగు రాజకీయాల్లో అల్లు అర్జున్ ఎలాంటి పాత్ర పోషిస్తారో అని.
