సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘వారణాసి’ (varanasi). ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయేలా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంటుంది. ఈ మధ్య ఈసినిమాకు లీకుల బెడద ఎక్కువైపోయింది. ఆగస్టు 8న మహేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో లీకై తీవ్ర కలకలం రేపింది.
వారణాసి ఘాట్ కు సబంధించి మహేష్ బాబుతో చిత్రీకరించిన ఈ సన్నివేశంలో ఒక లుక్ లీక్ అయ్యింది.అందులో మహేశ్ బాబు ఒంటి నిండాఫుల్ గా బ్లడ్ తో కనిపిస్తున్నారు. ఈ దృశ్యాలు చూసి అభిమానులు ఒకవైపు ఆయన మాస్ అవతారాన్ని చూసి థ్రిల్ అవుతున్నప్పటికీ, మరోవైపు ఇంతటి భారీ ప్రాజెక్టుకు ఎదురవుతున్న భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, వైరల్ అవుతున్న ఈ వీడియో అసలైనదేనా లేదా ఫేక్ నా అనే దానిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
ఈ చిత్రానికి లీకుల బెడద ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా సెట్స్‌కు సంబంధించిన ఫొటోలు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్, అనౌన్స్మెంట్ మెటీరియల్ భాగాలు అధికారికంగా విడుదలకాక ముందే ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. వరుసగా జరుగుతున్న ఈ లీకేజీల నేపథ్యంలో సెట్లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాలని ఫ్యాన్స్ మేకర్స్‌ను కోరుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయినట్లు సమాచారం. యాక్షన్ సీన్స్ పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈమూవీలో కొన్నివేశాలను ఐమ్యాక్స్ కెమెరాలతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణతో పాటు పోస్ట్-ప్రొడక్షన్ పనులను కూడా ఒక వైపు జరుగుతూనే ఉన్నాయి. ఎలాగైనా సరే ప్రకటించిన తేదీకి అంటే 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి రాజమౌళి టీమ్ రెడీ అవుతోంది.