కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (dharmendra pradhan ) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపించారు..గత కొంత కాలంగా నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీ మొత్తం గందరగోళం నెలకొంది..ఈ నేపథ్యంలోనే నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం తీవ్ర ఆందోనళకు దారితీసిన పరిస్థితులు మనకు తెలిసిందే.
అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని లోకేష్‌కి (Nara Lokesh) ముడిపెడుతుంది వైసీపీ పార్టీ. ఏపీలో ఇటీవల జరిగిన డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు వస్తున్నారు. దీనికి సంబందించి వైసీపీ ఆధారాలను కూడా బయటపెట్టింది, అర్హత లేని వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారని నిజంగా ఉత్తీర్ణత సాధించిన వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అందుకు బాధ్యత తీసుకుంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.. అంతే కాకుండా ఈ నెల 28న విద్యార్థి సంఘాలతో కలిసి వైసీపీ భారీ నిరసనకు పిలుపునిచ్చింది.
