సాయి కృష్ణను మే 6న మార్కాపురంలో విజయవాడ టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకుని, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులే సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మే 8న కూడా అతడు పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నట్లు అదే రిపోర్టు చెబుతోంది.
కానీ జూన్ 15న హైకోర్టులో మాత్రం డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌తో సహా పోలీసు ఉన్నతాధికారుల తరఫున సాయి కృష్ణ ఆచూకీ తెలియదని అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం అని చెప్పారు.
అయితే సాయి కృష్ణను పోలీసులే పట్టుకున్నారు. పోలీసులే విజయవాడకు తీసుకొచ్చారు. పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా నిర్బండ్చారని తల్లి తన స్టేట్ మెంట్ లో తెలిపింది. ఆ తర్వాత అతడు మరణించాడు..శవం మాయమైంది… సీసీటీవీ ఫుటేజీ కూడా మాయమైంది. అయినా కోర్టుకు మాత్రం సాయి కృష్ణ ఎక్కడున్నాడో తెలియదని పోలీసులు చెప్పారు.
సాయి కృష్ణ అరెస్టు గురించి డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు,విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబుకు తెలిసే మొత్తం జరిగిందని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఇక మరో పక్క సాయికృష్ణ తల్లి కేసుని వెనక్కి తీసుకోవడంపై పెద్ద ఎత్తున నుమానాలు వస్తున్నాయి.ఆమెను ప్రభుత్వం బెదిరించి కేసును వెనక్కి తీసుకునేలా చేసిందని చెబుతున్నారు.
