కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా ప్రతి పురుషుడు తమ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ముఖ్యమైన సూపర్‌ఫుడ్ గుమ్మడి గింజలు (Pumpkin Seeds). మగవారి ఆరోగ్యానికి గుమ్మడి గింజలు అందించే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.
ప్రతీ పురుషుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మరియు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పురుషులలో హార్మోన్ల సమతుల్యత, గుండె ఆరోగ్యం మరియు లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో గుమ్మడి గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.
టెస్టోస్టిరాన్ బూస్టింగ్
గుమ్మడి గింజలలో జింక్ (Zinc) సమృద్ధిగా లభిస్తుంది. జింక్ సరిపోను ఉంటే పురుషులలో టెస్టోస్టిరాన్ (Testosterone) హార్మోన్ స్థాయిలను క్రమబద్ధీకరించడానికి దోహదపడుతుంది .ఇది స్పర్మ్ క్వాలిటీని (శుక్రకణాల నాణ్యతను) మెరుగుపరిచి, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని (Fertility) బూస్ట్ చేస్తుంది.
గుండె ఆరోగ్యం – కొలెస్ట్రాల్ నియంత్రణ:
గుమ్మడి గింజలలో శరీరానికి మేలు చేసే హెల్తీ ఫ్యాట్స్ (Healthy Fats) మరియు మెగ్నీషియం (Magnesium) అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు (BP) మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యం (Prostate Health):
గుమ్మడి గింజలలో ఉండే కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలు (Special Compounds) పురుషులలో ప్రోస్టేట్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి. అయితే వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ప్రతీ పురుషుడు ప్రతిరోజు ఒక స్పూన్ (1 Spoon) గుమ్మడి గింజలను తమ రోజువారీ డైట్లో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పురుషులు తమ దినచర్యలో ఒక స్పూన్ గుమ్మడి గింజలను చేర్చుకోవడం ద్వారా హార్మోన్ల సమతుల్యతను సాధించడమే కాకుండా, గుండె మరియు ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
