ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ప్రజాక్టుల నిర్వహణలో ఏపీ ప్రభుత్వ అలసత్వం దూరదృష్టి లోపం వల్ల సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. కృష్ణా డెల్టాకు వారాబంది నిర్వహణ ద్వారా ఉపశమన చర్యలు తీసుకోవాలి. సర్వం పట్టిసీమ అన్నారు.. మరి ఇప్పుడు పట్టిసీమ నుంచి కాకుండా పులిచింతల ప్రాజెక్టు నుంచి డెల్టా రైతులు నీళ్లు ఎందుకు అడుగుతున్నారు.. శ్రీశైలం నిండక ముందే నిబంధనలకు విరుద్ధంగా ఎడమ కాలవల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలను అడ్డుకోకుండా , పోతిరెడ్డిపాడు, మల్యాల నుంచి నీరు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తుంది.
పురుషోత్తం రెడ్డి : రాయలసీమ మేధావుల ఫోరం