• Home  
  • Mahesh Babu :మహేష్ బాబు కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలు.. రాజమౌళి ఇప్పట్లో వదిలేస్తాడా.!
- Entertainment

Mahesh Babu :మహేష్ బాబు కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలు.. రాజమౌళి ఇప్పట్లో వదిలేస్తాడా.!

టాలీవుడ్ లో ‘సూపర్ స్టార్’ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో మహేష్ బాబు(Mahesh Babu). ఆయన సినిమా వస్తుందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది. సూపర్ స్టా్ అభిమానులు పండగ చేసుకుంటారు. ప్రస్తుతం ఆయన దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాతో గ్లోబల్ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు మహేష్ సిద్ధమవుతున్నారు. వారణాసి (Varanasi) […]

rajamouli mahesh babau

టాలీవుడ్ లో ‘సూపర్ స్టార్’ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో మహేష్ బాబు(Mahesh Babu). ఆయన సినిమా వస్తుందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది. సూపర్ స్టా్ అభిమానులు పండగ చేసుకుంటారు. ప్రస్తుతం ఆయన దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాతో గ్లోబల్ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు మహేష్ సిద్ధమవుతున్నారు.

వారణాసి (Varanasi) బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తే.. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు మార్కెట్ ఏర్పడుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు ఆయన ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఇప్పటి నుంచే మహేష్ బాబుతో సినిమాలు తీసేందుకు టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు ఇతర భాషల ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఆయనతో ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవడానికి పలువురు ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

తాజాగా ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ మహేష్ బాబుకు ఏకంగా ‘బ్లాంక్ చెక్’ ఆఫర్ చేసిందట! “రెమ్యునరేషన్ ఎంతైనా పర్వాలేదు.. మీకు ఇష్టం వచ్చినంత మొత్తం రాసుకోండి, కానీ మా బ్యానర్‌లో ఒక సినిమా సైన్ చేయండి” అని సదరు ప్రొడ్యూసర్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే, ఈ భారీ ఆఫర్‌కు కూడా సూపర్ స్టార్ పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం రాజమౌళి ప్రాజెక్ట్‌పైనే ఉందని, అనవసరమైన హడావుడికి ఆయన తావివ్వడం లేదని టాక్. మహేష్ బాబుకు ఆ రేంజ్ ఆఫర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఆఫర్ ఇచ్చింది కన్నడ టాప్ నిర్మాణ సంస్థ అయిన ‘హోంబలే ఫిలిమ్స్’ (Hombale Films) ప్రతినిధులే అని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది.ః

అయితే, రాజమౌళి (Rajamouli) ‘వారణాసి’ సినిమా థియేటర్లలోకి వచ్చి, విడుదలై పెద్ద విజయం సాధించే వరకు మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్‌లపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఏ ఇతర నిర్మాతలకు లేదా దర్శకులకు ఆయన కమిట్‌మెంట్స్ ఇవ్వడం లేదు. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌పైనే ఆయన పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.’వారణాసి’ విడుదలైన తర్వాతే తన నెక్స్ట్ మూవీ ఏంటి? ఎవరితో ఉంటుంది? అనేది అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. రాజమౌళి కూడా మహేష్ బాబును ఇప్పుడే వదిలే ప్రసక్తి లేదని అంటున్నాడట.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital