ముంబై నటి కాదంబరీ జెత్వాని కేసులో కూటమి ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆమె చేసిన ఆరోపణలన్నీ అబద్దమని సీఐడీ విచారణలో తేలింది. జెత్వానినే బెదిరించి డబ్బులు వసులు చేసిందని సుమారు ₹1.32 కోట్లకు సంబందించిన బ్యాంకు లావాదేవీల ఆధారాలు ఉన్నాయని సీఐడీ పేర్కొంది. ఈ కేసులో అసలు బాధితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అని పోలీసులు ఛార్జ్ షీట్ లో తెలిపారు. జెత్వానిపై దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి బెదిరింపు కేసులు నమోదయ్యాయని మనకి తెల్సిందే.. దీనిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త జిందాల్ కూడా ఉన్నారని ఆరోపణలు కూడా వచ్చాయి.
